కృష్ణ జిల్లా, గన్నవరం మండలంలోని తెంపల్లి గ్రామంలో జలజీవన్ ప్రాజెక్ట్ కింద 32 లక్షల రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్లు తక్షణం వేయాలని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు . సోమవారం అతిసారవ్యాధి ( డయోరియా ) బారిన పడి కోలుకుంటున్న తెంపల్లి గ్రామంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తో కలిసి ఆయన గ్రామమంతా కలియతిరిగారు . గ్రామంలో పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపరచాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఏ . డి . జ్యోతి గారికి ఆదేశాలు ఇచ్చారు . వర్షాల ప్రభావం వలన ప్రజలు నివసించే ప్రాంతాలలో ఎక్కడ నీరు నిలిచి ఉందొ గమనించి వెంటనే పారిశుద్ధ కార్మికులతో శుభ్రం చెయ్యాలని అధికారులకి ఆదేశాలు అందించారు. అలానే నీటి కుళాయిలకి సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాలని తెలియజేసారు.