క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలోనే చైనా రాజులు టీ తాగారట. 18వ శతాబ్దంలో క్యాంప్ బెల్ చైనా నుంచి ఈ తేయాకును మనదేశానికి తెచ్చారు. 1980 లో అమెరికాలో టీ బ్యాగులు వచ్చాయి. టీలో ఉండే టీమ్ అనే రసాయనం 2- 3 గంటల పాటు మెదడులోని రక్తకణాలను ఉత్తేజ పరుస్తుంది. టీ ప్రియులందరికీ తలనొప్పి నుంచి ఉపశమనం. హైదరాబాద్‌లో మాత్రం ఇరానీ చాయ్. లవంగాలు, నల్ల మిరియాలు, సోంపు గింజలు, దాల్చిన చెక్క కలిసి ఉండే మసాలా ఛాయ్ తాగినా క్యాలరీలు ఖర్చవుతాయట. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ లు రావొచ్చు. ఖర్చు తక్కువ ఆతిథ్యం టీ వల్లనే సాధ్యం. టీని కలపడం ఓ కళ. టీ రుచి టీ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కొందరు మరిగే నీళ్లలో టీపొడి వేసి కలుపుతారు. హోటళ్లలో తయారు చేసే టీలో లమ్సా అనే టీ ఆకును కలుపుతారు. డికాషిన్ ఎంత బాగా కలిపితే అంతబాగా రుచి వస్తుంది. టీని గ్లాస్‌లో పోసేటప్పుడు ఎత్తు నుంచి పోస్తే గాలితో కలిసి టీకి మంచి రుచి వస్తుందట.