వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తాము అండగా ఉంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ముంపు గ్రామాల పర్యటనలో భాగంగా అతిథి గృహం నుండి పర్యటనకు ర్యాలీగా వెళ్లారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఈ ముఖ్యమంత్రి విధానం సరిగా లేదని చెప్పినందుకు పోలీసులుతో అరెస్టు చేసి చంపే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయమే తాను గవర్నర్‌కి తెలియజేశానని.. ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది అన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని.. ప్రజలంతా తిరగబడితే వారు పారిపోవడం ఖాయమన్నారు.. శ్రీలంకలో అదే జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎవరి అబ్బ సొత్తు కాదని.. ప్రజాధనాన్ని పంచుతున్నారే తప్ప తన సొంత సొమ్ము లేని పంచటం లేదన్నారు. పెత్తందారీ వ్యవస్థ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరని.. ఒకవేళ భయపెట్టి వేధిస్తే వాళ్లకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ, జెండా సిద్ధంగా ఉన్నాయని, పోరాటానికి సిద్దమన్నారు.
పాలకొల్లులో ఎవ్వరికీ భయపడవలసిన పనిలేదని.. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు ఉన్నారని.. ఆచంట లో పితాని సత్యనారాయణ ఉన్నారన్నారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి సమస్య కోసం రాజీ లేజీ పోరాటం చేస్తూ ప్రతి సమస్యకు పరిస్కారం దిశగా కృషి చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడిని అభినందించారు. పోలవరం కనుక పూర్తిచేసి ఉంటే ఈ వరద సమస్య ఉండేది కాదని.. పోలవరాన్ని ముంచేశారని, ప్రాజెక్టు పూర్తి అనేదే ప్రశ్ననార్ధకంగా మారింది అన్నారు. పాలకొల్లులో అనారోగ్యంతో భాధపడుతూ కూలిపనికి వెళ్ళే అమ్మాయి ఆపరేషన్ కోసం రూ.25 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు మరో రూ.10 వేలు ప్రకటించారు.