పాకిస్తాన్, చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి మూడో దేశాన్ని ప్రొత్సహించాలని చైనా, పాకిస్తాన్ చూస్తున్న తరుణంలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. సీపెక్ కింద ఇలాంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, ఆమోదయోగ్యం కాదని భారత్ తన వాదనను తెలిపింది.