భారత్ లో మంకీపాక్స్ బాధితులు, అనుమానితులు, వారిని కాంటాక్ట్ అయిన వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. మంకీపాక్స్ బాధితులకు 21 రోజులపాటు ఐసొలేషన్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. 3 పొరల మాస్కును తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వ్యాధి వల్ల శరీరంపై ఏర్పడే పుండ్లు తగ్గే వరకు శరీరాన్ని దుస్తులతో కప్పి ఉంచుకోవాలని తెలిపింది.