అమెరికాకి చెందిన టైలర్ కొహెన్ అనే వ్యక్తి తన కలల ఉద్యోగం సాధించే విషయంలో 39 సార్లు విఫలమైనా పట్టువిడువలేదు. గూగుల్ ఉద్యోగం సాధించాలన్న తన కలను 40వ ప్రయత్నంలో ఎట్టకేలకు సాధించాడు. ‘పట్టుదలకు, పిచ్చితనానికి మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండింటిలో నాకున్నది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలో 39 తిరస్కరణలు, ఎట్టకేలకు ఒక ఆమోదం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.