జగనన్న స్మార్ట్ కాలనీ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం ఇంటి స్థలాలను వెంటనే గుర్తించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల అధికారులను ఆదేశించారు . శుక్రవారం స్థానిక స్పందన సమావేశపు హాల్ లో మున్సిపల్ కమిషనర్లు , ఆర్ . డీ . ఓ . లు , రెవిన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు . ఈ విషయంలో ఎక్కడ అవినీతికి తావులేకుండా , అలానే పనులు జాప్యం కాకుండా త్వరగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa