తమకు చెందిన భూభాగాన్ని అంగుళాన్ని కూడా రష్యాకు వదులుకోబోమనే వైఖరికి కట్టుబడి ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.. ‘మన దేశం వైఖరి ఎప్పటిలాగే ఉంది.. మేము మాది ఏదీ వదులుకోం’ అని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. ‘‘ఆక్రమణదారులు నకిలీ రిఫరెండమ్‌ల మార్గంలో కొనసాగితే ఉక్రెయిన్, స్వేచ్ఛా ప్రపంచంతో చర్చలకు దారులు మూసికుపోయినట్టే.. ఈ విషయంలో రష్యా వైపు స్పష్టత అవసరం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆక్రమించుకున్న తమ భూభాగాలను ఒకవేళ రష్యాలో కలిపేందుకు రెఫరెండం నిర్వహిస్తే మాస్కోతో చర్చలకు దారులు మూసుకుపోయినట్టే అని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలు రష్యాతో ఎటువంటి చర్చలు జరపబోవని జెలెన్‌స్కీ ఉద్ఘాటించారు. ప్రత్యేక సైనిక చర్య పేరుతో పొరుగు దేశంపై దండయాత్ర ప్రారంభించిన రష్యా.. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్, డొనెట్క్స్, ఖర్సోవ్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో రష్యాలో కలిపేందుకు రెఫరెండం చేపట్టే అవకాశం ఉందని అక్కడ క్రెమ్లిన్ అధికారులు పేర్కొంటున్నారు.
ఆదివారం రాత్రి ఓ వీడియో ప్రసంగంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. తమకు చెందిన భూభాగాన్ని అంగుళాన్ని కూడా రష్యాకు వదులుకోబోమనే వైఖరికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. ‘మన దేశం వైఖరి ఎప్పటిలాగే ఉంది.. మేము మాది ఏదీ వదులుకోం’ అని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. ‘‘ఆక్రమణదారులు నకిలీ రిఫరెండమ్‌ల మార్గంలో కొనసాగితే ఉక్రెయిన్, స్వేచ్ఛా ప్రపంచంతో చర్చలకు దారులు మూసికుపోయినట్టే.. ఈ విషయంలో రష్యా వైపు స్పష్టత అవసరం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న దండయాత్ర ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే, ఇరు దేశాలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మార్చి చివరి వారం నుంచి చర్చలు నిలిచిపోయాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సోవ్ ప్రాంతాన్ని రష్యా దళాలు చాలా వరకు ఆక్రమించుకున్నాయి. రాబోయే వారాలు లేదా నెలల్లో రష్యాలో చేరడంపై రిఫరెండం నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఇక, 2014లో రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న డాన్‌బాస్‌లో రెఫరెండ్ నిర్వహించి, లుహాన్స్క్, డొనెట్స్క్‌లను స్వయంపాలిత ప్రాంతాలుగా రష్యా గుర్తించింది. గత కొన్నివారాలుగా లుహాన్స్క్ గవర్నర్ దాదాపు రష్యా నియంత్రణలో పనిచేస్తున్నారు. కొత్తగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణకు రష్యా సిద్ధమవుతోందని, ఇందులో పాల్గొనడానికి అక్కడి ప్రజలకు ప్రయోజనాలను అందజేస్తోందని గవర్నర్ వ్యాఖ్యానించారు.