ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చెట్లు, కొమ్మలకు రాఖీ కడతారు. దీనిని ‘జంగిల్ రక్షా బంధన్’ అని అంటారు. మన ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రకృతిని సురక్షితంగా ఉంచుకోవడం మన కనీస ధర్మం అనే ఆలోచనతోనే అక్కడి ప్రజలు రాఖీ పండుగ రోజున తమకు సమీపంలోని అడవిలో చెట్లు, మహావృక్షాల కొమ్మలు, కాండాలకు రాఖీ కడుతుంటారు. అక్కడ ఈ ఆచారం 2004 నుంచి ఆచరణలో ఉంది.