ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో `డియ‌ర్ కామ్రేడ్‌`

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 07:59 PM

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో విజయదేవరకొండ. రస్మిక, విజయదేవరకొండ జతకట్టారంటే ఇక ఆ విజయమే. తాజాగా వీరిద్దరి కలయికలో `డియ‌ర్ కామ్రేడ్‌` సినిమా వచ్చింది. క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదయిన అవకాశాన్ని చేజిక్కించుకుకుంది. `డియ‌ర్ కామ్రేడ్‌` సినిమాను ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మ‌రో 28 చిత్రాల‌ను ఈ లిస్టులోకి ఎంపిక‌య్యాయి. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు. మరి అదికూడా మన `డియ‌ర్ కామ్రేడ్‌`కు దక్కుతుందో లేదో చూడాలి మరి..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa