బాలీవుడ్ సూపర్ హిట్ జంట షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన "దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే" (DDLJ) సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్‌లో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ అరుదైన గౌరవం అందుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా DDLJ నిలిచింది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, ఈ గౌరవానికి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. DDLJ ప్రేమ, దాని శక్తి గురించి చెప్పిన కథ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa