రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా కథతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో సినిమాల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన పాట “శరరత్”. ఈ పాట గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్‌లో మొదటిగా స్టార్ హీరోయిన్ తమన్నా పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం.అయితే ఈ విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మాట్లాడుతూ, “శరరత్” పాటకు తమన్నాను ఎంపిక చేస్తే బాగుంటుందని నేను సూచించినప్పటికీ, దర్శకుడు మాత్రం ఇందుకు అంగీకరించలేదని వెల్లడించారు.ఆదిత్య ధర్ అభిప్రాయం ప్రకారం, తమన్నా లాంటి స్టార్ ఈ పాటలో కనిపిస్తే ప్రేక్షకుల దృష్టి కథపై కాకుండా, ఆమె డ్యాన్స్, గ్లామర్‌పైనే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందట. దాంతో ఈ పాట కథ ప్రవాహానికి అడ్డుగా మారే ప్రమాదం ఉందని ఆయన భావించారట. ఈ కారణంతోనే ఈ సాంగ్‌ను సాధారణ కమర్షియల్ ఐటమ్ నెంబర్‌గా మార్చకుండా, కథలో సహజంగా కలిసిపోయేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడట.అదే ఆలోచనతో, స్టార్ ఇమేజ్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే ఇద్దరు యువ నటీమణులు అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాలను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల “శరరత్” పాట కథలో భాగంగా ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అయిందని సినీ వర్గాలు అంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa