ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిస్‌లో విడుదల కానున్న 'వారణాసి'మూవీ టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 02:45 PM

మహేష్‌బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' టీజర్‌ను జనవరి 5న పారిస్‌లోని యూరప్‌లోనే అతిపెద్దదైన 'లే గ్రాండ్ రెక్స్' థియేటర్‌లో విడుదల చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా 'వారణాసి' నిలుస్తుంది. టీజర్ విడుదల రాత్రి 9 గంటలకు జరగనుంది. భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ చిత్రాన్ని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa