ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి దశకు చేరుకున్న 'డెకాయిట్' షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 02:39 PM

టాలీవుడ్ హీరో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న 'డెకాయిట్' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మృణాల్ ఠాకూర్ తన భాగం షూటింగ్ పూర్తి చేయడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa