మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ విడుదల తేదీ ఖరారైంది. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించారు. వాయిదాల తర్వాత ఈ మూవీ మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలు, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. సీనియర్ నటుడు నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa