ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అల వైకుంఠపురములో’ సుశాంత్..,!

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 08:42 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమా ‘అల వైకుంఠపురములో’. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ ఫ్యామిలీ డ్రామాలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా సుశాంత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమాలో సుశాంత్, రాజ్ అనే క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఈ పాత్రను పోషించడం సంపూర్ణ ఆనందం అని సుశాంత్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ కామెడీ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa