దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటన చేసి నందమూరి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రూలర్ తో పాటు ఇంకా పలు టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం టైటిల్ విషయమై దీపావళికి క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 26న బాలకృష్ణ 105వ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి మోషన్ పోర్టును దీపావళి కానుకగా నందమూరి ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా ఇవ్వబోతున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా రాబోతున్న ఫస్ట్‌లుక్‌తో విడుదల తేదీపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa