ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27న 'భీష్మ' ఫస్ట్ లుక్...

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 07:57 PM

హీరో నితిన్ చేస్తున్న చిత్రాల్లో ‘భీష్మ’ కూడా ఒకటి. సింగిల్ ఫరెవర్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ‘ఛలో’తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫస్ట్ లుక్ ను రెడీ చేసిన టీమ్ దాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఇది కూడా వెంకీ కుడుముల గత చిత్రం ‘ఛలో’ తరహాలోనే రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ లాంటి పరాజయాల తర్వాత చేస్తున్న ఈ సినిమా మీదే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa