ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రిస్మస్ బరిలో ఇద్దరి లోకం ఒకటే మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 07:34 PM

ఎన్నో సినిమాలు అనుకున్నారు. కానీ చాలా సినిమాలు తప్పుకున్నాయి. కేవలం 2 మాత్రమే క్రిస్మస్ బరిలో మిగిలాయి. వాటిలో ఒకటి రూలర్ కాగా, రెండోది ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్య మాత్రమే పోటీ అనుకుంటున్న టైమ్ లో కొత్తగా మరో సినిమా వచ్చి చేరింది.   దిల్ రాజు నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఇద్దరి లోకం ఒకటే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పైగా రాజ్ తరుణ్ కు ఇప్పుడొక హిట్ అవసరం. అందుకే క్రిస్మస్ బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. క్రిస్మస్ సెలవులతో పాటు జనవరి 1 హాలిడే కూడా కలిసొస్తుంది కాబట్టి 2 వీకెండ్స్ వరకు సినిమాకు తిరుగుండదనేది దిల్ రాజు ప్లాన్. వరుసగా ఫ్లాపులు చూస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హీరోయిన్ గా నటిస్తున్న షాలినీ పాండే కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa