ఫిదా' సినిమాలో తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. తెలుగు భాష నేర్చుకుని .. తెలంగాణ యాస మీద ఆసక్తిని పెంచుకుని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. సాయిపల్లవి నటన .. ఆమె పలికిన తెలంగాణ యాస ఆ పాత్రను ప్రేక్షకుల మనసుకు దగ్గరగా తీసుకెళ్లాయి. ఈ ఒక్క సినిమాతోనే ఆమె ఓ పది హిట్ సినిమాలు చేసినంతటి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
అలాంటి సాయిపల్లవి 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లోను తెలంగాణ అమ్మాయిగానే కనిపించనుందట. ఈ సినిమా కథ వరంగల్ నేపథ్యంగా కొనసాగుతుంది. నాయకా నాయికలు ఇద్దరూ తెలంగాణకి చెందినవారే. అయితే ఒకే తరహా పాత్ర అనిపించకూడదనే ఉద్దేశంతో, తెలంగాణ యాస మాత్రం మాట్లాడదట. ఈ సినిమాలోను తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa