నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa