ఏ చిన్నపాటి విరామం దొరికినా విరాట్ కోహ్లి, భార్య అనుష్క శర్మ జంట దాన్ని విహార యాత్రకు కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భూటాన్‌లో విహార యాత్రకు వెళ్లిన ఈ జంట.. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన రెండో వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ జోడి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. దీనిలో భాగంగా స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో విరుష్క జోడి చక్కర్లు కొట్టింది. మంచుతో కప్పబడిన ఆ కొండల్లో విరాట్-అనుష్కలు సరదా సరదాగా గడిపారు. వీటికి సంబంధించి ఫొటోలను విరాట్ తన ట్వీటర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa