వచ్చే నెల 9న మూవీ సంక్రాంతి కానుకగా రజిని కాంత్ దర్బార్ పలు భాషలలో గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేనెల 3వ తేదీన హైదరాబాద్ లో కూడా నిర్వహించనున్నారని సమాచారం. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మొదటిసారి రజిని తో ఈ చిత్రం చేస్తున్నారు. ఆయన రజిని కానీ ఓరూత్ లెస్ బాడ్ పోలీస్ అధికారిగా చూపించనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రజిని కాంత్ భార్య పాత్ర చేస్తున్న నయనతార వృత్తి రీత్యా ఆర్కిటెక్ గా కనిపిస్తారట. కథలో ఆమె పాత్ర కూడా చాల కీలకం అని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యంగ్ సెన్సేషన్ అనిరుధ్ అందించారు. నిన్న దర్బార్ మూవీ నుండి మూడవ సాంగ్ ‘నిఖార్సైన బ్రహ్మచారిని..’ విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa