ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే స్టార్టప్ కంపెనీల కథాంశంతో విశ్వక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో ప్రారంభమైన కొన్ని స్టార్టప్ కంపెనీలు, వాటిని స్థాపించిన యువత ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. అర్బన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సత్యసాగర్ సంగీతం, ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అజయ్ కథుర్వర్, డింపుల్ హీరో హీరోయిన్లుగా గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ముల్కల దర్శకత్వంలో తాటికొండ ఆనందం బాలక్రిషన్ నిర్మిస్తోన్న చిత్రం 'విశ్వక్'. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లోని పేపర్ కటింగ్స్, వాటిని ఓ బోర్డ్‌కు పిన్ చేసినట్లు ఉండటం.. ఇవన్నీచూస్తుంటే 'విశ్వక్' ఒక డిఫరెంట్ మూవీ అనేది తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa