మెగా ఫ్యామిలీ హీరోల లిస్ట్‌లోకి సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా చేరిపోయాడు. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చేసింది. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి 'ఉప్పెన' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్ అప్పట్లో ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ మసాలా అంశాలకు పోకుండా, రా నెరేషన్‌లోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్. మత్స్యకారుల జీవన శైలి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోను విలన్ రోల్‌కు తీసుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ నుంచి ఇన్నాళ్లకు ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రేపు సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa