'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రవితేజ తో 'డిస్కో రాజా' లో నటించింది నభ నటేశ్. శుక్రవారం విడుదలైన డిస్కో రాజా టాక్ విషయం పక్కనబెడితే.. ఈ సినిమాలో నాభ నటేశ ను దర్శకుడు కేవలం గెస్ట్ రోల్ కు పరిమితం చేసాడు. ఫస్ట్ సాంగ్ లో చాలా అందంగా కనబడిన నభ నటేశ్ పాత్రకి ఈ సినిమా కథలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. నభా నటేష్ గురించి చెపుకొవడానికి డిస్కో రాజలో సీన్స్ ఎక్కడా కనబడవు. ఇస్మార్ట్ తో నాభ నటేశ్ కి డిస్కో రాజా లో మరింత ప్రాధాన్యం ఉందనుకున్నవారికి.. ఈ సినిమాలో ఆమె పాత్ర చూస్తే తెలుస్తుంది. మరి కేరీర్ లో సినిమాలు చెయ్యాలని ఇలాంటి సినిమాలు ఒప్పేసుకుంటూ పొతే... చేతిలో సినిమాల సంగతలా ఉంచి.. చివరికి అవకాశాలే రాకుండా పోయే ప్రమాదముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa