ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ తరహాలో పవన్ కళ్యాణ్ పాత్రలో ఉంటుందట!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 12:41 PM

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన 26వ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పిరియాడికల్ ఫిల్మ్ అని, ఇలాంటి సినిమాలు తీయడంలో క్రిష్ కు మంచి నైపుణ్యం ఉంది కాబట్టి దర్శకుడిగా ఆయన్ను తీసుకున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందట. అంటే ధనవంతుల దగ్గర సంపదను దోచుకుని పేదలకు పంచే గజదొంగ పాత్రన్నమాట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందించాలని నిర్మాత ఏ.ఎమ్ రత్నం భావిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తారని, త్వరలోనే ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో మొదలవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు వాస్తవముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa