అల.. వైకుంఠపురములో చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోవడమే కాదు, బాక్సాఫీసు వద్ద రికార్డులు నమోదు చేసింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించడంతో చిత్రబృందం వరుసగా సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ హుషారెత్తిస్తోంది. తాజాగా ఓ సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమను కూడా విజయోత్సవాల్లో భాగం చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటినించో అడుగుతున్నారని, వాళ్ల కోసం తప్పకుండా ఓ ఫంక్షన్ నిర్వహిస్తానని అప్పట్లో మాటిచ్చానని తెలిపారు. ఇప్పుడు అల... వైకుంఠపురములో చిత్రం అదిరిపోయే హిట్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అయితే, తాను ఈ సినిమాలో 'సిత్తరాల సిరపడు' పాటలో పొగ తాగుతూ కనిపిస్తానని, కానీ అది సినిమా కోసం చేసిందని, దయచేసి అభిమానులెవరూ తనను ఫాలో కావొద్దని హితవు పలికారు. రియల్ లైఫ్ లో తాను సిగరెట్లకు చాలా దూరంగా ఉంటానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa