ట్రెండింగ్
Epaper    English    தமிழ்

250కోట్ల క్లబ్ లో అజయ్ దేవగణ్ 'తన్హాజీ' !

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 05:01 PM

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ లేటెస్ట్ మూవీ తన్హాజీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం ఏకంగా 250కోట్ల వసూళ్లు దక్కించుకొని అబ్బురపరిచింది. పీరియాడిక్ మూవీగా వచ్చిన తన్హాజీ…ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడు అయిన తన్హాజీ వీర గాథ ఆధారంగా తెరకెక్కింది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో తన్హాజీ పాత్ర చేయగా హీరోయిన్ కాజోల్ తన్హాజీ భార్య పాత్ర చేశారు. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేయడం విశేషం. దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 150కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన తన్హాజీ పోటీలో కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇక అజయ్ దేవగణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఓ ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తున్నారు. ఇటీవలే మొదలైన తాజా షెడ్యూల్ నందు అజయ్ దేవగణ్ పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు రోల్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa