ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్లో చివరి నిమిషాల్లో టైటిల్స్ మార్చిన సినిమాలు ఇవే !

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2020, 07:23 PM

గత కొంతకాలంగా కొన్ని తెలుగు చిత్రాలపై వివాదాలు ముసురుకుంటున్నాయి... టైటిల్ వల్ల, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది ఆరోపించడం వల్ల, సినిమాలో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల...ఇలా ఏవేవో కారణాలతో నిత్యం వార్తల్లో ఉన్నాయి.. వాటిలో కొన్ని సినిమాలను పరిశీలిద్దాం...
1.లక్ష్మీస్ ఎన్టీఆర్ :రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చంద్రబాబును టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు... చంద్రబాబుని పూర్తి నెగిటివ్ గా చూపించే ప్రయత్నం వర్మ చేశారని ఈ సినిమాను నిషేదించాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.... దీనిపై నేతలు హైకోర్టును ఆశ్రయించారు... అలా ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి...
2. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు: ఈ సినిమాకు మొదట టైటిల్ గా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు... దీనిపై ఆ రెండు సామాజిక వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన టైటిల్ ను మార్చారు.. ఈ సినిమాలో చాలా మార్పులు చేసిన తర్వాత మాత్రమే విడుదలకు హైకోర్టు అనుమతించింది...
3. గద్దలకొండ గణేష్: ఈ సినిమాకు మొదట టైటిల్ గా వాల్మీకి అనుకున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్.. కానీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు నిరసనలు వ్యక్తం చేయడంతో టైటిల్ మార్చక తప్పలేదు...
4. బెజవాడ: ఈ సినిమాకు మొదట బెజవాడ రౌడీలు టైటిల్ పెట్టాలని రామ్ గోపాల్ వర్మ భావించారు... కానీ బెజవాడ ప్రజల నుండి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వర్మ దిగిరాక తప్పలేదు...
5. రంగస్థలం: ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాటలో "గొల్లభామ" అనే పదం వస్తుంది... ఇది తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందని వారు ఆరోపించడంతో గోరువంకగా మార్చారు... ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు వివాదాస్పదం అయ్యాయి... వాటిపై నిర్మాతలు వెనక్కుతగ్గడంతో సమస్యలు ప్రశాంతంగా సద్దుమణిగాయి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa