ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంధాదూన్' సినిమా రీమేక్ కి శ్రీకారం చుట్టేపనిలో నితిన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 04:39 PM

చాలా కాలం తరువాత నితిన్ కి 'భీష్మ' సినిమాతో హిట్ పడింది. ఈ సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేస్తూ, 'అంధాదూన్' సినిమా రీమేక్ కి శ్రీకారం చుట్టేపనిలో వున్నాడని అంటున్నారు. 2018లో హిందీలో వచ్చిన , 'అంధాదూన్' వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నితిన్ దక్కించుకున్నాడు. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించడమే కాకుండా తను నటించనున్నాడు.


హిందీలో 'టబు' పాత్ర చాలా కీలకం. తెలుగులో ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ .. స్నేహ .. రెజీనా .. అనసూయల పేర్లను  పరిశీలిస్తున్నారట. వీళ్లలో నుంచే ఎంపిక ఉంటుందా? మరికొంతమంది పేర్లను ఈ జాబితాలో చేరుస్తారా? అనేది చూడాల్సి వుంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగుకి చాలానే సమయం ఉండొచ్చు. ఎందుకంటే  'రంగ్ దే' .. 'చెక్' సినిమాలను పూర్తి చేసిన తరువాతనే నితిన్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళతాడు. మొత్తానికి ఈ ఏడాది అంతా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తాడన్న మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa