ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీకి ఎంత లాస్ అంటే ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 04:46 PM

దర్శకుడు క్రాంతి మాధవ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా రాశి ఖన్నా, క్యాథెరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తో నడిచిన ఈ చిత్రం భారీ నష్టాల దిశగా వెళుతుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై వారం గడిచిపోయింది. కొత్త సినిమాల రాకతో ఇంకా వసూళ్లు నెమ్మదించాయి. మొత్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పెద్ద మొత్తంలో నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. 30కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిసినెస్ జరిపిన ఈ చిత్రం కనీసం 10కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. దీనితో 50 శాతానికి పైగా నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa