ఎవరో సల్మాన్ ఖాన్ లాంటి విశాల హృదయం ఉన్న బ్యాచిలర్లు తప్ప మిగతా హీరోలందరూ ఏదో ఒక సమయంలో వివాహానికి ఊ అనాల్సిందే. టాలీవుడ్ బ్యాచిలర్లు కూడా అందుకు ఎక్సెప్షన్ ఏమీ కాదు. ఈ మధ్య టాలీవుడ్ హీరోలు పెళ్ళి బాట పడుతున్నారు. తమ సింగిల్ జీవితం ఫరెవర్ గా ఉండకుండా వైఫ్ తో ఎంచక్కా మింగిల్ అయ్యేందుకు తెగ ఉబలాటంగా ఉన్నారు. ఈ హీరోలు తమ బ్రహ్మచారి జీవితానికి ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో ఫుల్ స్టాప్ పెడుతూ ఉండడం గమనార్హం.
ఈమధ్యే యువ హీరో నితిన్ తన మ్యారేజ్ సంగతి వెల్లడించాడు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇంతలో నితిన్ కొత్త సినిమా 'భీష్మ' విడుదలైంది. హిట్ టాక్ తో దూసుకుపోతోంది. వరస ఫ్లాపులతో సతమతమైన నితిన్ కు ఈ విజయం వేసవిలో పన్నీటి జల్లు లాంటిదే. పెళ్ళి ఫిక్స్ కాగానే ఇలా హిట్ దక్కడం శుభసూచకమని కొందరు నెటిజన పండితులు శెలవిస్తున్నారు.
ఒక్క నితిన్ మాత్రమే కాదు ఈమధ్య మరో యువ హీరో నిఖిల్ కూడా తన ప్రేమ విషయం.. నిశ్చితార్థం విషయం వెల్లడించాడు. త్వరలో ఒకింటివాడిని కాబోతున్న విషయం ప్రకటించాడు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు. నిఖిల్ లాస్ట్ సినిమా 'అర్జున్ సురవరం' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. అయితే అ సినిమా పెళ్ళి విషయం వెల్లడించక ముందు కాబట్టి కౌంట్ చెయ్యలేం. అయితే మ్యారేజ్ జరిగేలోపు 'కార్తికేయ 2' రిలీజ్ కాకపోతే మాత్రం బ్యాచిలర్ లైఫ్ లో లాస్ట్ సినిమా అర్జున్ సురవరం' అయ్యే అవకాశం ఎక్కుగా ఉంది. దీంతో నిఖిల్ కూడా హిట్టుతో బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్తున్నట్టే. ఈ సెంటిమెంట్ బలపడితే బాహుబలి భల్లాలదేవ లాంటి సీనియర్ బ్యాచిలర్ బ్యాచ్ కూడా మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa