కాక్ టైల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ఒక కాలేజ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి నమిత మాట్లాడుతూ రొమాన్స్ చిత్రాలు చూసి చూసి బోర్ కొట్టేసిందని తెలిపింది. కాక్‌టైల్ లాంటి కామెడీ చిత్రాలను చూడడమే ఇష్టమని చెప్పింది. ఈ చిత్రాన్ని తాను థియేటర్‌కు వెళ్లి చూస్తానని తెలిపింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీజీ.ముత్తయ్య, ఎం.దీప కలిసి పీజీ.మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కాక్‌టైల్. నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయనకు మిత్రులుగా రమేష్, మిథున్, విజయ్ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్ బాలా, ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు షియాజీ షిండే, మనోబాలా, మైమ్‌గోపి నటించారు. నవ దర్శకుడు ఆర్. విజయ్‌మురుగన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్‌జే.రవిన్ ఛాయాగ్రహణం, ఎస్.సాయిభాస్కర్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రంలో ఆస్ట్రేలియాకు చెందిన కాక్‌టైల్ అనే పక్షి ప్రధాన పాత్రలో నటించిందని, అలా ఒక పక్షి ప్రధాన పాత్రలో నటించడం ఇదే ప్రప్రథం అని నిర్మాతలు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa