ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన శైలి ఉంది. తక్కువ కాలంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఈ కుర్రాడు.. సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేస్తున్నాడు.ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విజయ్ దేవరకొండకు పూర్తి నిరాశే మిగిలించింది. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి ప్యాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫైటర్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా తెలుగులో అరంగేట్రం చేయనుంది. అంతేకాక ఈ సినిమా కోసమే విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకున్నాడు. హీరో హీరోయిన్లు ఒక బైక్ సీక్వెన్స్ సీన్‌కు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్న ‘ఫైటర్’తో విజయ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa