బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఉదయం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. అయితే ఈ సినిమా పైన అనేక రకాలుగా అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కాగా తాజాగా బాలయ్య ఈ సినిమాలో ఒక సైలెంట్ పాత్రలో బాలయ్య నటించబోతున్నాడట. అంటే పెద్దగా డైలాగ్ లు అండ్ ఫైట్స్ లేని పాత్రలో అన్నమాట. ఆ పాత్రనే అఘోరా పాత్ర అని తెలుస్తోంది. ఆధ్యాత్మికతతో అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట. ఈ పాత్ర బాలయ్యకు చాల కొత్తగా ఉంటుందట. ఇక గతంలో బాలయ్య ఎప్పుడూ ఇలాంటి పాత్రలో నటించలేదు. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కవలలుగా కనపడబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు. అలాగే శ్రియా సరన్ ను కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రియా బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాలో కలిసి నటించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa