ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఖైదీ’ తర్వాత నాతో చేస్తున్నందుకు వినాయక్ గారికి థ్యాంక్స్ : థరమ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2018, 03:51 PM

మెగా హీరో సాయి థరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ‘ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వినాయక్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేగాక వరుస పరాజయాలతో ఉన్న తేజ్ కు కూడా ఈ చిత్రం చాలా ముఖ్యమైంది.సినిమా గురించి తేజ్ మాట్లాడుతూ ‘ఖైదీ నెం ‘ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన తరవాత నాతో సినిమా చేస్తున్న వినాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల్ ముందుకు వస్తున్నాం. అదే రోజున వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కూడా విడుదలవుతోంది. తేజ్ కు నాకు ఎలాంటి పోటీ లేదు. రెండు సినిమాలు బాగా ఆడుతాయి అన్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపించనుంది.a






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa