నేటి సినిమాల తీరే మారిపోయింది. కంటెంట్ పరంగా బోల్డ్ సన్నివేశాలకు కొదవేలేకుండా పోతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలైతే అడల్ట్ సన్నివేశాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నాయని చెప్పక తప్పదు. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే.. అక్కడ కూడా శృంగార భరిత సన్నివేశాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన 'సిన్' ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవలే డిజిటల్ ఫీల్డ్‌లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ కమర్షియల్ సినిమాలు నిర్మించిన ఆయన ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచించి కొందరు సన్నిహితుల భాగస్వామ్యంతో ‘ఆహా ఓటీటీ' కి శ్రీకారం చుట్టారు. ఈ ‘ఆహా ఓటీటీ' సమర్పణలో 'సిన్' అనే వెబ్ సిరీస్ రూపొందించారు.అల్లు అరవింద్ 'ఆహా' యాప్ భాగస్వామ్యంతో శరత్ మరార్ ఈ సిన్ అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. జాగ్వార్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దీప్తి సతి, జెన్నిఫర్, నటుడు రవి వర్మ ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భార్యతో బలవంతంగా శృంగారం చేయడం అనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఇది రూపొందుతోంది.ఇటీవలే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో బెడ్ రూమ్ సీన్లు, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపించడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భార్యతో బలవంతంగా శృంగారం చేయాలనుకునే భర్త, అతడి వల్ల చిత్ర హింసలు అనుభవించే భార్య తాలూకు సన్నివేశాలతో నేటితరం యువతను ఆకర్షించేలా ఈ వీడియో ఉంది.ఈ సిన్ (SIN) అనే వెబ్ సిరీస్‌ని నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నారు. అతిత్వరలో ఈ వెబ్ సిరీస్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేయనుంది. గతంలో కూడా కియారా అద్వానీ ఇలాంటి అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'తో ఫుల్ పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే.''ఈ రోజుల్లో ఎవరైనా డిజిటల్ మీడియంలోకి రావాలంటే సందేహించొద్దు. భవిష్యత్తు డిజిటల్ రంగానిదే. ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ‘ఆహా ఓటీటీ' ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఆహా గురించి మా అబ్బాయిలకు (అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శీరిష్) లకు చెప్పగానే..‘నాన్నా.. నువ్వు రేపటిని చూస్తున్నావ్'.. అన్నారు'' అని గతంలో ఓ కార్యక్రమంలో చెప్పారు అల్లు అరవింద్.
Introducing the trailer of #Sin, an @ahavideoIN original!
https://t.co/mt3LJVD1Eo
An emotional maze of love, lust and betrayal. Watch how the story unfolds only on aha.
Download the App Now!
Playstore https://t.co/THd2TklXum
Appstore https://t.co/fuT6MD5Cj5 pic.twitter.com/Z1SjLp2IUN
— Geetha Arts (@GeethaArts) March 31, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa