పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త సినిమాల అప్ డేట్స్ గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ మూడు కొత్త చిత్రాల్లో నటించేం దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటి లో వకీల్ సాబ్ చిత్రీకరణ తుది దశలో ఉంది. మధ్యలో లాక్ డౌన్ రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆంక్షలు ఎత్తివేశాక సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. ఇకపోతే పవన్ అంగీకరించిన మరో చిత్రం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. పిరియాడిక్ సినిమాలు తీయడంలో పేరున్న క్రిష్ ఈ చిత్రాన్ని 1870 కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా తీయబోతున్నట్టు సమాచారం. నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణం గా సెట్స్ వేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు.ఈ లోపు కరోనా వల్ల బ్రేక్ పడింది. పవన్, క్రిష్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుందని, భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తారని స మాచారం. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా పవన్ ఎక్కువ రోజులు డేట్స్ ఇచ్చారని తెలిసింది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ అందాల సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ #హరోయిన్‌గా నటించనుందని సామాజిక మాథ్యమా ల్లో ప్రచారం జరు గుతోంది. జాక్వెలిన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ప్రభాస్ నటించిన సా#హూ సినిమా లో ఓ ప్రత్యేక గీతం చేసిం ది. ఇప్పుడు పవన్‌తో సినిమా చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సిఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa