మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాతలు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా సినిమా షూటింగ్ ఆగింది. ప్రారంభంలో ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ ఆగింది. దీంతో మూవీ విడుదల వాయిదా పడుతుందని వార్తలు వినపడుతున్నాయి.దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తి అయిందని చెప్పారు. రామ్ చరణ్ కోసం హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. ఇదొక సోషియో-ఫాంటసీ చిత్రమని... సహజ వనరులను కాపాడేందుకు ఒక వ్యక్తి చేసే పోరాటమే 'ఆచార్య' అని చెప్పారు.ఈ సందర్భంగా కొరటాల శివ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని ఆయన చెప్పారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయమని తెలిపారు. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించేందుకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa