దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఉగాది సందర్భంగా కీలక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా టైటిల్ లోగో మోషన్ పోస్టర్ రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ సోలో సీన్స్ .. ఎన్టీఆర్ సోలో సీన్స్ ను చిత్రీకరించారట. అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణను కూడా పూర్తి చేశారట.హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించవలసిన సన్నివేశాలు మాత్రమే మిగిలిపోయాయని సమాచారం. చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ సరసన ఒలీవియాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు జంటల మధ్య వేరువేరుగా చిత్రీకరించవలన సన్నివేశాలు .. పాటలను సిద్ధం చేసి వుంచారట. లాక్ డౌన్ తరువాత వాటి చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa