ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ అభిమానులకు బాడ్ న్యూస్..

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 12:46 PM

కెజిఫ్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. భారీ క్రేజ్ నెలకొన్న కెజిఫ్ చాప్టర్ 2 మూవీపై వచ్చే ప్రతి అప్డేట్ హాట్ కేక్ తో సమానం. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి విలన్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ అధీరా లుక్ తో పాటు రాకీ భాయ్ గా యష్ లుక్స్ విడుదల చేశారు. ఈ లుక్స్ కి భారీ ఆదరణ దక్కింది. షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఈ మూవీ నుండి టీజర్ వస్తుందని అందరూ ఆశగా ఎదురు చుస్తున్నారు. సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రాలలో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రం కెజెఫ్2. 2018లో వచ్చిన కెజిఫ్ భారీ విజయం అందుకోవడంతో దానికి కొనసాగింపుగా కెజిఫ్ 2 తెరక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. గత చిత్రానికి మించి ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కెజిఫ్ 2 లో ప్రధాన విలన్ అధీరా పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ చేస్తుండగా, రవీనా టాండన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.ఐతే ఈ మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కెజిఫ్ సినిమా విడుదలకు చాల సమయం ఉన్న నేపథ్యంలో కెజిఫ్ టీజర్ చూడాలని ఆశపడుతున్నారు. కాగా ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ కెజిఫ్ నిర్మాతలు టీజర్ ఉండదని చెప్పడం జరిగింది. ఒకే సారి మూవీ విడుదలకు ముందు అక్టోబర్ లో ట్రైలర్ విడుదల చేస్తారట. యష్ హీరోగా తెరక్కుతున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa