ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడిగా కనిపించడం కోసం సూర్య కసరత్తులు

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 12:52 PM

విభిన్నమైన కథలు చేస్తూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య.. తమిళ సినిమాలో లాగే తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదిచుకున్నాడు.. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా సూర్యని ఓ తమిళ్ హీరో కాకుండా తెలుగు హీరోలాగే భావిస్తారు అలా ఆయన గతంలో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో 13 ఏళ్ల కుర్రాడిగా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అదే తరహాలో ఇప్పుడు ఆయన మరో ప్రయోగం చేస్తున్నాడు.సుధ కొంగర దర్శకత్వంలో జీఆర్ గోపీనాథ్ బయోపిక్ లో సూర్య  నటిస్తున్నాడు. తమిళంలో 'సురరైపోట్రు' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా, 'ఆకాశం నీ హద్దురా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలో సూర్య కొంత సేపు 19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట. అలా కనిపించడం కోసం ఆయన గట్టి కసరత్తులే చేసినట్టు సమాచారం. 44 ఏళ్ల సూర్య .. తెరపై 19 ఏళ్ల యువకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa