సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది.రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, అక్రమంగా కలపను తరలించే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట్లో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన, రీసెంట్ గా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. విజయ్ సేతుపతి పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందట.తమిళంలో ఈ సినిమాను విడుదల చేసినప్పుడు, విజయ్ సేతుపతి అభిమానులతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయనతో సుకుమార్ మాట్లాడే సున్నితంగా తప్పించినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో 'భైరవగీత' హీరో ధనుంజయను తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్టు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa