ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు తో రాజమౌళి...?

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 01:08 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఉగాది సందర్భంగా కీలక ప్రకటన వెలువడనుంది. మహేష్ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ రాజమౌళి పంచుకున్నారు. ఆయన చడీచప్పుడు లేకుండా ఓ భారీ అనౌన్స్మెంట్ చేసేశారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కే ఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2022లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2021లో ఈ మూవీ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏ జోనర్ లో తెరకెక్కనుంది అనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ ని ఎపిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.మరి మహేష్ తో ఆయన చేసే చిత్రం ఏ జోనర్ లో ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. మహేష్ తో కూడా ఆయన పీరియాడిక్ డ్రామాగా తీస్తారా లేక కాంటెంపరరీ స్టోరీతో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తారో చూడాలి. గతంలో వీరి కాంబినేషన్ లో జేమ్స్ బాండ్ మూవీ రానుందని వార్తలు వచ్చాయి. దీనితో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజమౌళి తీసే అవకాశం కూడా వుంది. ఇక జోనర్ ఏదైనా ఈ మూవీ భారీగా తెరకెక్కడం ఖాయం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa