ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ కి మెయిన్ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 12:18 PM

హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో హీరోయిన్ గా మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కంటిన్యూ కాలేకపోయింది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వస్తోంది. గోపీచంద్ మ‌లినేని – మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న ‘క్రాక్’ సినిమాలో ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ లేడి విలన్ గా నటిస్తుందట. ఏదో మెయిన్ విలన్ చాటు లేడీ విలన్ లా కాకుండా.. ఆమె కూడా మెయిన్ విలన్ గానే చేస్తోందట. తన భర్తను చంపిన హీరో మీద పగ బట్టిన ఆడదాని పాత్రలో ఆమె చాల బాగా నటిస్తోందట. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో క్రాక్ సినిమా పైనే రవితేజ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa