ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువగా నడుస్తుంది. తెలుగులో కూడా మనోజ్ లాంటి హీరోలు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హాయిగా ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతుంటాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. గతేడాది తెలుగులో మంచు మనోజ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తన భార్యకు విడాకులు తీసుకున్నట్టు ప్రకటిచడం సంచలనం అయింది. అంతకు ముందు దియా మీర్జా, కే.రాఘవేంద్రరావు కొడుకు కే.ప్రకాష్ కోవెలమూడి,కనికా థిల్లాన్, రీసెంట్‌గా శ్వేతా బసు ప్రసాద్ కూడా ఇదే బాటలో తన భర్తతో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో గాయని చేరింది. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో టైటిల్ పాట పాడిన సునిధి చౌహాన్ తాజాగా తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది.ఆమె తన భర్త హితేష్ సోనిక్ నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోవడానికి లాక్‌డౌన్ సమయాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.వీరిద్దరు వాళ్ల ఎనిమిదేళ్ల బంధానికి పులిస్టాప్ పెట్టేసారు. మీడియాకు అందిన సమాచారం మేరకు సునిధి, హితేష్ గత కొద్ది రోజులుగా విడివిడిగానే ఉంటున్నట్టు సమాచారం. వీరిద్దరు ఆ విషయాన్ని బయటపెట్టలేదు. కాగా ఇటీవలె సునిధి హితేష్‌ల వారి స్నేహితులు కలిసి గోవాకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీరిద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు సమాచారం. అవి వీళ్లిద్దరు విడిపోవడానికి బీజం పడింది. దీంతో వీళ్లిద్దరు విడిపోవడానికి నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇక వీరిద్దరు కూడా రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2012లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో గోవాలో జరిగిన వీరి రిసెప్షన్ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. సునిధి 2018లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఇది సునిధికి రెండో వివాహం. 2002లో ఆమెకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబీ ఖాన్‌తో పెళ్లి జరిగింది. యేడాది తర్వాత వారిద్దరు విడిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa