సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట పరశురామ్. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్ పేరు వినబడుతుంది. అయితే తాజాగా శ్రద్ధా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే శ్రద్దా కపూర్.. ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటించింది. 'సాహో' తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. మరి పరశురామ్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని తీసే ప్లాన్ ఉన్నాడట. దీంతో శ్రద్దా కపూర్ అయితే బావుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa