బాలీవుడ్ నటి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అతడు... ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తతోంది. బాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, మోడల్ షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతిని రేప్ చేసారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో బెదిరించి సంతోఖ్ సింగ్ అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం మే 14వ తేదీన ఈ దారుణం జరిగినప్పటికీ... ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడింది. అయితే ఓ వ్యక్తి చొరవ తీసుకోవడంతో బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa