తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభంకానుంది. దీంతో ఇటీవల కొంత మంది పేర్లు కూడా లీక్ అయ్యాయి. ఈసారి సీజన్‌లో ఉండే వారి లిస్టులో నటి శ్రద్ధా దాస్ పేరు కూడా వచ్చింది. ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై శ్రద్ధ ట్విట్టర్ ద్వారా ఘాటుగానే స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయినా కూడా పుకార్లు ఆగకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు.
తనను బిగ్‌బాస్ 4లో పాల్గొనాలని ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కానీ వార్తలు మాత్రం ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు రాసే ముందు జర్నలిస్టులు వివరణ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వార్తలు రాయడం వల్ల చాలా మంది తనను ఆరా తీస్తున్నారని చెప్పారు. ఈ ప్రచారం ఇక్కడితో ఆగాలని పేర్కొన్నారు. ఇదే నా లాస్ట్ వార్నింగ్, లేదంటే కేసు పెడతానంటూ హెచ్చరించారు. అసత్యపు వార్తలను ఆపేయాలని సూచించారు.
I hav Not been approached for Big boss Telugu & i am not a part of it.
Once again, inundated with msgs from a lot of ppl askin me about it & putting my name up as if it is confirmed already.Will have to take legal action on the sources otherwise!Making it clear 1 last time pls
— Shraddha das (@shraddhadas43) July 26, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa